Chikkaballapur Molvi: మసీదులో ఆరేళ్ల బాలికపై మౌల్వీ తండ్రి అఘాయిత్యం

Chikkaballapur Molvi Arrested for Assaulting 6 Year Old Girl in Mosque
  • చాక్లెట్ ఆశచూపి బాలికను లోబరుచుకున్న దుండగుడు
  • నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
  • జమాత్ కమిటీపై స్థానికుల ఆగ్రహం
  • నిందితుడికి జ్యుడీషియల్ కస్టడీ
కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో దారుణం జరిగింది. ఒక మసీదు ప్రాంగణంలో ఆరేళ్ల చిన్నారిపై ఓ మౌల్వీ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడిని పట్టుకున్న స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఒక మసీదులో పనిచేసే మౌల్వీకి తండ్రి. స్థానిక జమాత్ కమిటీ గౌరవపూర్వకంగా అతడికి మసీదు ప్రాంగణంలోనే నివాసం ఉండేందుకు ఒక గదిని కేటాయించింది. అయితే, ఈ నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన నిందితుడు చాక్లెట్ కొనిస్తానని ఆశ చూపి ఆరేళ్ల బాలికను మసీదులోని తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

నిందితుడు 20 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి చిక్కబళ్లాపురానికి వలస వచ్చి స్థిరపడ్డాడని, ఫుట్‌పాత్‌పై బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి మసీదులో ఆశ్రయం కల్పించిన స్థానిక జమాత్ కమిటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులకు అప్పగించే ముందు బాధితురాలి తల్లి, స్థానికులు కలిసి నిందితుడికి దేహశుద్ధి చేశారు.  
Chikkaballapur Molvi
Chikkaballapur
Karnataka Crime
Molvi Arrest
Minor Girl Assault
Mosque
Uttar Pradesh
Crime News
Sexual Assault

More Telugu News