Chiranjeevi: మైడియర్ శేఖర్... మీలాంటి అభిమాని ఉండడం నాకూ ఆనందకరమే: చిరంజీవి

Chiranjeevi says having a fan like Sekhar Kammula is a pleasure
  • శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రస్థానంపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
  • "మీలాంటి అభిమాని ఉండటం నాకు ఆనందకరం" అన్న చిరంజీవి
  • తన స్ఫూర్తితో శేఖర్ ప్రస్థానం సాగడంపై సంతోషం వ్యక్తం చేసిన మెగాస్టార్
  • శేఖర్ కమ్ముల సినిమాల్లోని సున్నితమైన వినోదం, సామాజిక అంశాలపై ప్రశంసలు
  • మరో 25 ఏళ్ళు విజయవంతంగా సాగాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్ష
  • శేఖర్ ప్రయాణంలో తాను భాగమైనందుకు గర్వంగా ఉందని వెల్లడి
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చలనచిత్ర రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. చిరంజీవి సమక్షంలో ప్రత్యేక పోస్టర్ ఆవిష్కరించారు. దీనిపై చిరంజీవి నేడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. శేఖర్ కమ్ములకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 

"మై డియర్ శేఖర్, మీలాంటి ఒక అభిమాని ఉండటం నాకూ అంతే ఆనందకరం" అని చిరు పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల ప్రస్థానానికి తాను స్ఫూర్తినిచ్చానని తెలుసుకోవడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

శేఖర్ కమ్ముల 25 ఏళ్ల సినీ ప్రయాణంలో తాను కూడా ఒక భాగంగా ఉన్నందుకు గర్వంగా ఉందని చిరంజీవి తెలిపారు. శేఖర్ కమ్ముల చిత్రాల శైలిని ప్రశంసిస్తూ, "సున్నితమైన వినోదంతో పాటు, ఒక సోషల్ కామెంట్‌ను జత చేసి ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం" అని చిరంజీవి అన్నారు. ఫిలిం మేకింగ్‌లో శేఖర్ కమ్ముల తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్నారని కొనియాడారు.

భవిష్యత్తులో కూడా శేఖర్ కమ్ముల మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, "ఇలాగే మరో 25 ఏళ్లు మరెన్నో జనరంజకమైన సినిమాలు రాస్తూ, తీస్తూ, మరెన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు. 

అంతేకాదు, ఓ పెన్ ను కూడా శేఖర్ కమ్ములకు మెగాస్టార్ బహూకరించారు.
Chiranjeevi
Sekhar Kammula
Telugu cinema
Tollywood
Director
Film industry
Movie celebrations
Social media
Film making
Anniversary

More Telugu News