Raghurama Krishnam Raju: జగన్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు: రఘురామకృష్ణరాజు

Jagan Politically Committed Suicide Says Raghurama Krishnam Raju
  • గంజాయి బ్యాచ్ ను కలవడమేంటని జగన్ కు రఘురామ ప్రశ్న
  • పోలీసులపై హత్యాయత్నం చేసినవారికి జగన్ అండదండలా? అని మండిపాటు
  • నన్ను కస్టడీలో కొట్టించింది జగనే అంటూ తీవ్ర వ్యాఖ్యలు
వైసీపీ అధినేత జగన్ తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను జగన్ పరామర్శించడం దిగజారుడు ఓట్ల రాజకీయాలకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

"రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవనేది జగన్ లాంటి వారిని చూసే పుట్టింది. గంజాయి బ్యాచ్‌ను పరామర్శించి ఆయన రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు" అని రఘురామ వ్యాఖ్యానించారు. పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులకు జగన్ అండదండలు అందించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు.

గతంలో తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు, జగనే తనను కస్టడీలో కొట్టించారని రఘురామ సంచలన ఆరోపణ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌ను చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేమని ఆయన అన్నారు. "నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైసీపీ నేతల అదృష్టం" అంటూ రఘురామ ఎద్దేవా చేశారు. జగన్ వైఖరి రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఆయన చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
Raghurama Krishnam Raju
Jagan
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh
Amaravati
Political Suicide
Criminal Politics
Deputy Speaker
AP Assembly

More Telugu News