England Cricket Team: సైకిళ్లపై స్టేడియంకు వచ్చిన ఇంగ్లండ్ క్రికెటర్లు... వీడియో ఇదిగో!

England Cricket Team Arrives at Oval Stadium on cycles
  • ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్
  • నేడు లండన్ లో చివరి వన్డే మ్యాచ్
  • ఆటగాళ్లు సైకిళ్లపై వచ్చిన వీడియో పంచుకున్న ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో వైట్ బాల్ సిరీస్ లు ఆడుతోంది. మూడు వన్డేల  సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇవాళ నామమాత్రమైన మూడో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ కు లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా నిలుస్తోంది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ సమయాల్లో ఆటగాళ్లు భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో స్టేడియంకు చేరుకుంటారు. అయితే, ఇవాళ ఇంగ్లండ్ ఆటగాళ్లు అందుకు భిన్నంగా సైకిళ్లపై స్టేడియానికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. రోడ్ల మూసివేత సమస్యను తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం అని వెల్లడించింది. 
England Cricket Team
England vs West Indies
England Cricket
West Indies Cricket
Oval Stadium
London
Cricket Match
White Ball Series
Cricket News

More Telugu News