Elon Musk: త్వరలోనే భారత్ లో స్టార్ లింక్ సేవలు

Starlink Services in India Soon
  • దేశంలో ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌కు త్వరలో అనుమతులు జారీ అవుతాయన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
  • స్టార్ లింక్ కు లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను టెలీకమ్యూనికేషన్స్ శాఖ జారీ చేసిందన్న మంత్రి 
  • సుదూర ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ముఖ్యమన్న మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్‌కు భారత్‌లో కార్యకలాపాల కోసం లైసెన్సు దాదాపుగా వచ్చినట్లేనని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. స్టార్ లింక్‌కు టెలీకమ్యూనికేషన్ శాఖ లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిందని ఆయన వెల్లడించారు. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ తుది అనుమతులు జారీ చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో శాటిలైట్ కనెక్టివిటీ కోసం వన్ వెబ్, రిలయన్స్ సంస్థలకు అనుమతులు ఉన్నాయని, స్టార్ లింక్‌కు అనుమతుల జారీ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయిందని మంత్రి తెలిపారు. త్వరలోనే లైసెన్సు జారీ అవుతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు.

సర్వీస్‌ను పరీక్షించే నిమిత్తం వన్‌వెబ్, రిలయన్స్‌కు మినిమల్ ఎక్స్‌ప్లోరేటరీ బేసిస్ ప్రాతిపదికన స్పెక్ట్రమ్ కేటాయింపు జరిగిందని తెలిపారు. స్టార్ లింక్ సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఆ తర్వాత కమర్షియల్ కార్యకలాపాల కోసం స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి విధి విధానాలను ట్రాయ్ జారీ చేస్తుందని మంత్రి వివరించారు. సుదూర ప్రాంతాల్లో కనెక్టివిటీ కోసం శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. 
Elon Musk
Starlink
India
Satellite internet
Jyotiraditya Scindia
টেলিকম્યુనిকেশন శాఖ
OneWeb
Reliance Jio
TRAI
Space Communication

More Telugu News