RCB: క‌ప్పు కొట్టిన ఆర్‌సీబీ.. బ‌న్నీ త‌న‌యుడి భావోద్వేగం.. ఇదిగో వీడియో!

RCB Wins IPL Title Allu Ayaans Emotional Reaction
  
ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా కప్పు కొట్టింది రాయల్ ఛాలెజర్స్ బెంగళూరు (ఐపీఎల్‌). 18 ఏళ్లుగా కలగా ఉన్న టైటిల్ ను ఎట్ట‌కేల‌కు సొంతం చేసుకుంది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా పంజాబ్‌ కింగ్స్ (పీబీకేఎస్‌)తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగుల‌కే ప‌రిమిత‌మైంది. మరోవైపు ఒక్కసారీ టైటిల్ గెల‌వ‌ని పంజాబ్  కు మరోసారి నిరాశే ఎదురైంది.

ఇదిలాఉంటే... 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర దించుతూ ఆర్‌సీబీ ఐపీఎల్‌ తొలి టైటిల్‌ను సొంతం చేసుకోవ‌డంతో ఆ జ‌ట్టు అభిమానుల ఆనందానికి అవ‌ధుల్లేవు. దేశ‌వ్యాప్తంగా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ అభిమానులు, కోహ్లీ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. సామాజిక మాధ్య‌మాల ద్వారా జ‌ట్టుకు విషెస్ తెలియ‌జేస్తూ త‌మ భావోద్వేగాల‌ను పంచుకుంటున్నారు. 

ఇక‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్... విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆర్‌సీబీ విజ‌యం సాధించ‌డంతో బ‌న్నీ త‌న‌యుడు ఎమోష‌న‌ల్ అయ్యాడు. త‌ల‌పై బాటిల్ నీళ్లు కుమ్మ‌రించుకుని భిన్నంగా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఆ వీడియోను అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం అయాన్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.   
RCB
Royal Challengers Bangalore
Allu Arjun
Allu Ayaan
IPL
Virat Kohli
IPL Title
Punjab Kings
RCB Victory

More Telugu News