Telangana EVs: తెలంగాణలో 2 లక్షల మార్కు దాటిన 'ఈవీ'లు

Telangana EVs Cross 2 Lakh Mark
  • తెలంగాణలో జోరుగా ఈవీ వాహనాల కొనుగోళ్లు
  • ఈవీలతో వాటి యజమానులకు, పర్యావరణానికి మేలు
  • మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా 80 శాతం బైక్‌లు
పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. ఈవీల వల్ల ఈ సమస్య ఉండదు. దీంతో కాలుష్య నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) సంఖ్య 2 లక్షల మార్కును అధిగమించింది.

కాలుష్య నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఈవీ పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవీ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.

2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే (మార్చి 31) నాటికి రవాణాశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. ఏప్రిల్ నెలాఖరుకు ఆ సంఖ్య 2 లక్షలు దాటినట్లు రవాణాశాఖ వర్గాలు వెల్లడించాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో అత్యధికంగా (80 శాతం పైగా) బైక్‌లు ఉండగా, ఆ తర్వాత కార్లు ఉన్నాయి.

ఈవీ వాహనాలతో యజమానులకు, పర్యావరణానికి మేలు జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చుతో పోలిస్తే ఛార్జింగ్ ద్వారా వాహన యజమానులకు ఖర్చు బాగా ఆదా అవుతోంది. 

Telangana EVs
Electric Vehicles Telangana
EV sales Telangana
Telangana EV policy
Electric bikes Telangana
EV registration Telangana
Pollution control Telangana
Telangana transport department
EV subsidies Telangana

More Telugu News