WhatsApp: మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్!

WhatsApp Introducing New AI Chatbot Feature
  • త్వరలో అందుబాటులోకి రానున్న కస్టమ్ ఏఐ చాట్ బాట్
  • ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్ల కోసం విడుదల
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. కోట్లాది మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మెటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది.

ఈ క్రమంలో తాజాగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు సొంతంగా కస్టమ్ ఏఐ చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టర్ల కోసం విడుదల చేయగా, త్వరలోనే మిగతా వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

ఇప్పటికే ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ యాప్‌లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు వ్యక్తిత్వం, రూపాన్ని సైతం డిజైన్ చేసుకోవడానికి చాట్‌బాట్ ఉపయోగపడుతుంది.

చాట్‌బాట్ సిద్ధమయిన తర్వాత వినియోగదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. తాజా ఫీచర్ త్వరలోనే వాట్సాప్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉండగా, బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 
WhatsApp
WhatsApp new feature
AI chatbot
Artificial Intelligence
Meta
WhatsApp update
Beta testers
Instant messaging
Social media
Mobile app

More Telugu News