Yuva Galam: జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా 'యువగళం'.. డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస

Nara Lokesh presents Yuva Galam book to Deputy CM Pawan Kalyan
  • రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన 'యువగళం' పాదయాత్ర
  • ఈ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని ప‌వ‌న్‌, ఇత‌ర మంత్రుల‌కు అంద‌జేసిన లోకేశ్‌ 
  • యువగళం పుస్తకంపై డిప్యూటీ సీఎం ప్రశంసల జ‌ల్లు
రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేశ్‌... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేశ్‌ అందజేశారు. 

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృత మైందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేశ్‌ను ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికీ జనం మర్చిపోలేదని తెలిపారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా యువనేత లోకేశ్‌... పవన్ కల్యాణ్‌తో పంచుకున్నారు.

Yuva Galam
Nara Lokesh
Pawan Kalyan
Andhra Pradesh Politics
Telugu Desam Party
YSRCP Government
Political Book
AP Cabinet Meeting
State Secretariat
Political History

More Telugu News