Ambati Rambabu: పోలీస్ అధికారిపైకి దూసుకెళ్లిన అంబటి... ఏమాత్రం తగ్గని ఆఫీసర్!

- నేడు వెన్నుపోటు దినం నిర్వహిస్తున్న వైసీపీ
- పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం
- వీడియో వైరల్
వైసీపీ నేతలు నేడు ఏపీలో వెన్నుపోటు దినం నిర్వహించే ప్రయత్నం చేశారు. వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కూడా వెన్నుపోటు దినం నిర్వహించే క్రమంలో పోలీసులతో గొడవ జరిగింది. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అయితే, ఓ పోలీస్ అధికారి అంబటి రాంబాబు తీరుపై నిప్పులు చెరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లింది. ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.