Rishi Sunak: ఇంకా ఆర్సీబీ గెలుపు కిక్కులోనే ఉన్న రిషి సునాక్... ఫొటోలు ఇవిగో!

Rishi Sunak Still Enjoying RCB Victory Photos
  • నిన్న అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫైనల్
  • పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ఆర్సీబీ
  • ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా బెంగళూరుకు టైటిల్
  • స్టేడియంలో ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ ఊగిపోయిన రిషి సునాక్
  • నేడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసిన బ్రిటన్ మాజీ ప్రధాని
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ చరిత్రలోనే జూన్ 3వ తేదీ చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఐపీఎల్ ఎప్పుడో 2008లోప్రారంభం కాగా, టైటిల్ గెలవాలన్న ఆర్సీబీ కల ఇన్నాళ్లకు నెరవేరింది. నిన్న పంజాబ్ కింగ్స్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు 6 పరుగుల తేడాతో నెగ్గి కప్ కైవసం చేసుకుంది. 

ఇక నిన్నటి ఫైనల్ కు ఓ విశిష్ట అతిథి హాజరయ్యారు. ఆయన మరెవరో కాదు.. బ్రిటన్ మాజీ ప్రధాని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్. ఆయన ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్. ఐపీఎల్ ఫైనల్ వీక్షించేందుకు సతీసమేతంగా భారత్ విచ్చేసిన ఆయన స్టేడియంలో ఓ రేంజిలో సందడి చేశారు. సగటు ఆర్సీబీ అభిమానికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఊగిపోయారు. ఇవాళ కూడా రిషి సునాక్ ఇంకా అదే కిక్కులో ఉన్నారు. సోషల్ మీడియాలో మ్యాచ్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు. వాట్ ఏ నైట్... ఈ సాల కప్ నమదు (ఈసారి కప్ మనది) అంటూ క్యాప్షన్ పెట్టారు. 
Rishi Sunak
RCB
Royal Challengers Bangalore
IPL Final 2024
Punjab Kings
Narendra Modi Stadium
Infosys Narayana Murthy
Cricket
T20
Ahmedabad

More Telugu News