Kuldeep Yadav: త్వరలోనే కుల్ దీప్ యాదవ్ పెళ్లి... ఘనంగా నిశ్చితార్థం

Kuldeep Yadav Getting Married Soon Engagement Held Grandly
  • చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక
  • లక్నోలో బుధవారం స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్న కుల్‌దీప్, వంశిక
  • లక్నోలోని శ్యామ్ నగర్ లో ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్న వంశిక
భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను పెళ్లాడనున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక బుధవారం లక్నోలో అత్యంత వైభవంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కుల్దీప్, వంశిక ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుల్దీప్, వంశికల నిశ్చితార్థ వేడుకకు భారత యువ క్రికెటర్ రింకూ సింగ్ తదితరులు హాజరైనట్లు సమాచారం.

వంశిక విషయానికి వస్తే.. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని శ్యామ్ నగర్ నివాసి. ప్రస్తుతం ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. కుల్దీప్‌తో ఆమెకు చిన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఆ స్నేహం ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబసభ్యులు వివాహానికి అంగీకరించారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. 
Kuldeep Yadav
Kuldeep Yadav wedding
Vamshika
Indian spinner
Rinku Singh
Lucknow
Engagement photos
Cricket
Uttar Pradesh
LIC

More Telugu News