Ambati Rambabu: అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Case filed against Ambati Rambabu at Pattabhipuram Police Station
  • వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పోలీస్ అధికారిపై అంబటి రాంబాబు మండిపాటు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అంబటి సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులను బెదిరించినందుకు కేసు నమోదైంది. గుంటూరులో నిన్న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబుకు పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలంతో విమర్శించారు.

అంబటి రాంబాబు ప్రవర్తనపై ఒక పోలీస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటూ, వేలు చూపిస్తూ ఘర్షణకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. 
Ambati Rambabu
Ambati Rambabu case
Pattabhipuram Police Station
YSRCP
Guntur
Vennupotu Dinam
Police obstruction
Section 353

More Telugu News