G Parameshwara: సుమారు 8 లక్షల మంది వచ్చారని అంచనా: తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హోంమంత్రి

G Parameshwara 8 Lakh People Estimated at Bangalore Stampede
  • చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట, 11 మంది మృతి
  • 8.70 లక్షల మెట్రో టిక్కెట్లు అమ్ముడుపోయాయన్న హోంమంత్రి
  • అంతా సవ్యంగా జరిగితే రికార్డ్ అయ్యేదన్న హోంమంత్రి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర స్పందించారు. సుమారు 8 లక్షల మంది ప్రజలు ఆర్సీబీ విజయోత్సవాలకు హాజరయ్యారని అంచనా వేశారు.

ఆయన మాట్లాడుతూ, "విధానసౌధ వెలుపల లక్ష మంది, స్టేడియం వెలుపల 25,000 మంది ఉంటారని మేము అంచనా వేశాం. మొత్తం 8.70 లక్షల మెట్రో టిక్కెట్లు అమ్ముడయ్యాయి. వీరిలో ఎక్కువమంది క్రికెట్ అభిమానులేనని భావిస్తే, దాదాపు 8 లక్షల మంది వచ్చినట్లు లెక్క. క్రికెట్ కోసం ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటం మునుపెన్నడూ జరగలేదు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఇది ఒక రికార్డు అయ్యేది. ఈ విషయంపై నేను ఆర్సీబీ యాజమాన్యంతో, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)తో మాట్లాడాను. వారు తమ అభిప్రాయాలను తెలిపారు" అని ఆయన వివరించారు.

మృతులను దివ్యాంషి (13), భూమిక్ (20), శివలింగ (17), ప్రజ్వల్ (20), శ్రవణ్ (20), చిన్మయి (19), సహాన (25), అక్షత (27), దేవి (29), దొరేశ (32), మనోజ్ (33)గా గుర్తించారు. వీరిలో చాలామంది బెంగళూరు నగరానికి చెందినవారు కాగా, మరికొందరు సమీప జిల్లాల నుంచి తరలివచ్చారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన హోంమంత్రి పరమేశ్వర, "ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఘటనా స్థలంలోనే ఎవరైనా మరణించినట్లు మాకు సమాచారం లేదు. గేట్ల వద్ద ఎంతమంది చనిపోయారనే దానిపై కూడా స్పష్టత లేదు. గేట్లు 7, 6, 2, 2ఏ, 16, 17, 18, 21 వద్ద తొక్కిసలాటలు జరిగాయి. పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశాం" అని తెలిపారు.
G Parameshwara
Karnataka Home Minister
RCB victory celebration
Chinnaswamy Stadium
Bangalore stampede
Karnataka State Cricket Association
KSCA
Bangalore news
stampede incident
Divyanshi

More Telugu News