NTR: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ముఖ్యనగరాలలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

NTRs Diamond Jubilee Celebrations in Major Cities of Australia and New Zealand
  • పాల్గొంటున్న టి.డి.జనార్థన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తదితరులు
  • ఎన్నారై టీడీపీ, తెలుగు సంఘాల సంయుక్తంగా నిర్వహణ‌
  • ఈరోజు న్యూజిలాండ్‌ రాజధాని ఆక్లాండ్‌లో మొదటి కార్య‌క్ర‌మం
న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలోని ముఖ్య నగరాలలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సీబీఎన్‌ 75 ఇయర్స్‌ వేడుకల ఉమ్మడి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్ధన్‌, ప్రత్యేక అతిథి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణలు గురువారం పయనమై వెళ్లారు. 

ఎన్నారై టీడీపీ, తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మొదటిది ఈరోజు న్యూజిలాండ్‌ రాజధాని ఆక్లాండ్‌లో జరుగుతుంది. దీనికి తెలుగుదేశం శాసనసభ్యులు బోడే ప్రసాద్‌, ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ వైస్ ఛైర్మన్‌ అశ్విన్‌ అట్లూరి కూడా పాల్గొంటున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు జూమ్‌ ద్వారా పాల్గొంటున్నారు.

జూన్‌ 7న మెల్బోర్న్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథి టి.డి.జనార్ధన్‌తో పాటు నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బోడే ప్రసాద్‌, అశ్విన్‌ అట్లూరి పాల్గొంటారు. జూమ్‌ ద్వారా రఘురామకృష్ణaరాజు తమ సందేశాన్ని ఇస్తారు.

జూన్‌ 8న అడిలైడ్‌ నగరంలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవం, సీబీఎన్‌ 75వ జన్మదినం వేడుకలలో ముఖ్య అతిథులుగా టి.డి.జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, బోడే ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి పాల్గొంటారు.

జూన్‌ 9న సిడ్నీ నగరంలో జరిగే కార్యక్రమంలో టి.డి. జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడే ప్రసాద్‌, అశ్విన్‌ అట్లూరిలతో పాటు ప్రముఖ సినీ యువనటుడు నారా రోహిత్‌, తెలుగుదేశం సీనియర్‌ నేత, టీటీడీ సభ్యుడు నర్సిరెడ్డి పాల్గొంటారు.

జూన్‌ 11న బ్రిస్బేన్‌ నగరంలో జరిగే మినీ మహానాడు, ఎన్టీఆర్‌ సినీవజ్రోత్సవ కార్యక్రమాల్లో టి.డి.జనార్ధన్‌, నందమూరి రామకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బోడె ప్రసాద్‌, నారా రోహిత్‌, అశ్విన్‌ అట్లూరి, నన్నూరి నర్సిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఈ కార్యక్రమాలలో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

NTR
NTR cinematic Diamond Jubilee
CBN 75 years
TD Janardhan
Nandamuri Ramakrishna
Telugu Desam Party
Australia
New Zealand
Nara Rohit
Telugu Sanghams

More Telugu News