Revanth Reddy: సీఎం రేవంత్‌తో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి కీలక భేటీ.. గంటపాటు చర్చలు!

Revanth Reddy Meets AICC Incharge Meenakshi Natarajan
  • హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశం
  • ప్రస్తుత రాజకీయాలు, కేబినెట్ విస్తరణపై ప్రధానంగా చర్చ?
  • పీసీసీ కమిటీల ఏర్పాటు అంశం కూడా ప్రస్తావన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇరువురు నేతల మధ్య దాదాపు గంటకు పైగా చర్చలు జరిగాయి.

ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ అవకాశాలు, అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి సంబంధించిన వివిధ కమిటీల నియామకం వంటి కీలక అంశాలపై వీరిద్దరూ సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ గత పది రోజులుగా పార్టీ నేతలతో విస్తృతంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.
Revanth Reddy
Telangana
AICC
Meenakshi Natarajan
Congress Party
Telangana Politics

More Telugu News