AP Liquor Scam: ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా

AP Liquor Scam Vijayawada Court Adjourns Key Hearing
  • ఏపీ మద్యం కేసులో ఈ వారం జరగాల్సిన విచారణ వాయిదా
  • ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసిన విజ‌య‌వాడ కోర్టు
  • ఈడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థల విచారణ మరింత వేగవంతం
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరగాల్సి ఉన్న కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ ఇవ్వాల‌ని నిందితులు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విజ‌య‌వాడ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. 

ఇరువ‌ర్గాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వంటి దర్యాప్తు సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక కేసులో తమ విచారణను ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ వాయిదా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక, ఈ కేసులో రాజ్ క‌సిరెడ్డితో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ మాజీ కార్యదర్శి కె. ధనుంజయ రెడ్డి, అలాగే పి. కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలు అరెస్టు అయి విజయవాడ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. 
AP Liquor Scam
Raj Kasireddy
AP liquor case
Vijayawada court
Enforcement Directorate
ACB
Dhanunjaya Reddy
Krishna Mohan Reddy
Bharati Cements
Govindappa

More Telugu News