Chandrababu Naidu: ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

Chandrababu lokesh Wishes Muslims on Bakrid
  • హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే పండుగే బక్రీద్: సీఎం చంద్రబాబు
  • హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తిగా అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలన్న సీఎం
  • నిస్వార్ధమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింపజేయడమే బక్రీద్ పండుగ ముఖ్యోద్దేశమన్న మంత్రి నారా లోకేశ్
బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

హజ్రత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా నిర్వహించుకునే బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ‘ఈద్ ముబారక్’ అని వారు పేర్కొన్నారు. త్యాగ బుద్ధిని, నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉన్నవారే దైవకృపకు పాత్రులు అవుతారనే సూక్తిని బక్రీద్ మనకు తెలియజేస్తుందని తెలిపారు.

నేటి ఆధునిక కాలంలో సాటి మనిషిని ప్రేమించేవారే నిజమైన దైవభక్తులుగా చెప్పవచ్చునని ముఖ్యమంత్రి అన్నారు. హజ్రత్ ఇబ్రహీం స్ఫూర్తితో అందరూ సాటివారిని ఆదరిస్తూ సహృదయంతో ముందుకు సాగాలని ‘బక్రీద్’ సందర్భంగా ఆకాంక్షించారు.

త్యాగం, అనురాగం, దాన గుణాలను పెంపొందించే పండుగ ఈద్‌ అల్‌ అదా (బక్రీద్) అని, ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నిస్వార్ధమైన ఆత్మీయ అనుబంధాలను వ్యాపింపజేయడమే బక్రీద్ పండుగ ముఖ్యోద్దేశమని ఆయన అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రవక్త ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుందామని లోకేశ్ పిలుపునిచ్చారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
Bakra Eid
Eid al-Adha
Muslim festival
Nara Lokesh
Muslims
Bakrid Greetings
Nara lokesh

More Telugu News