Palla Srinivasa Rao: పల్లాను ఫోన్ లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu consoles Palla Srinivasa Rao over phone
  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృవియోగం
  • పల్లా తండ్రి, మాజీ శాసనసభ్యుడు సింహాచలం కన్నుమూత
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • సింహాచలం సేవలను స్మరించుకున్న ముఖ్యమంత్రి
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం శనివారం కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. సింహాచలం మరణం పట్ల విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పల్లా సింహాచలం అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

పల్లా సింహాచలం మృతి పట్ల రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. "తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది" అని పేర్కొన్నారు. సింహాచలం గారు ఎమ్మెల్యేగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసిన కృషి మరువలేనిదని జవహర్ కొనియాడారు. "ఉత్తరాంధ్ర ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి సింహాచలం గారు. పల్లా శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. సింహాచలం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని జవహర్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Palla Srinivasa Rao
Palla Simhachalam
Chandrababu Naidu
Telugu Desam Party
Andhra Pradesh
KS Jawahar
MLA
Ex-MLA
Condolences

More Telugu News