Etela Rajender: కాళేశ్వరం కమిషన్ విచారణపై ఈటల సంచలన వ్యాఖ్యలు

Etela Rajender Comments on Kaleshwaram Commission Inquiry
  • కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకేంటని ప్రశ్న
  • కేబినెట్ లో చర్చించకుండా ప్రభుత్వంలో ఏమీ జరగదని వెల్లడి
  • తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఈటల
బీఆర్ఎస్ అధినేత,  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన ఈటల.. కేసీఆర్ ను రక్షించేందుకే వాస్తవాలను దాచిపెట్టారన్న ఆరోపణలపై మాజీ మంత్రి స్పందించారు. ఆదివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినపుడు ఆర్థిక మంత్రిగా ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటిలో తన పాత్రను కమిషన్ ముందు వెల్లడించినట్లు చెప్పారు.

ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కాంగ్రెస్ నేతలు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉప సంఘం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే లేదని తెలిపారు. కాళేశ్వరంలోని అనేక ప్రాజెక్టుల రీడిజైనింగ్ను కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. త్వరలోనే అన్ని జీవోలు, సబ్ కమిటీ నిర్ణయాలు, సూచనలు బయటపెడతా అని చెప్పారు.

మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై..
కాళేశ్వరం ప్రాజెక్టు అంశం అసలు కేబినెట్ ముందుకే రాలేదంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. కేబినెట్లో చర్చించకుండా ప్రభుత్వంలో ఏదీ జరగదని గుర్తుచేశారు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టుపై కేబినెట్ చర్చించలేదనడం సరికాదని అన్నారు. ప్రాజెక్టు విషయంలో తీసుకున్న ప్రతీ నిర్ణయంపై కేసీఆర్ అందరితో సంతకాలు తీసుకున్నారని చెప్పారు. ఈ విషయం అప్పటి మంత్రులు తుమ్మల, జూపల్లి, కడియం శ్రీహరిలకు కూడా తెలుసని అన్నారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
Etela Rajender
Kaleshwaram project
KCR
BRS
Telangana
Tumala Nageswara Rao
Cabinet sub committee
Irrigation project
Corruption
CBI investigation

More Telugu News