Akhil Akkineni: అఖిల్, జైనాబ్ లతో మహేశ్ బాబు, నమ్రత... రిసెప్షన్ ఫొటోలు ఇవిగో!

Akhil Akkineni Weds Zainab Reception Photos Mahesh Babu and Namrata Attend
  • అక్కినేని అఖిల్, తన ప్రేయసి జైనాబ్ రవడ్జీల వివాహం
  • జూన్ 6న హైదరాబాద్‌లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి
  • వధువు ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవడ్జీ కుమార్తె
  • రెండేళ్లకు పైగా ప్రేమించుకున్న జంట ఇప్పుడు ఒక్కటైంది
  • అంగరంగ వైభవంగా రిసెప్షన్‌
  • ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. యువ నటుడు, అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన జైనాబ్ రవడ్జీ మెడలో ఆయన మూడుముళ్లు వేశారు. ఈ వివాహ వేడుక జూన్ 6, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. 

ఇది అక్కినేని కుటుంబంలో జరిగే చివరి వివాహం కావడంతో, రిసెప్షన్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందుకు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ లోని అనెక్జ్ వేదికగా నిలుస్తోంది. ఈ రిసెప్షన్ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు విచ్చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత దంపతులు, తమిళ స్టార్ హీరో సూర్య కూడా విచ్చేశారు.

జైనాబ్ రవడ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవడ్జీ కుమార్తె. జుల్ఫీ రవడ్జీకి కన్‌స్ట్రక్షన్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాలలో వేల కోట్ల టర్నోవర్‌ కలిగిన పలు వ్యాపారాలు ఉన్నాయి. అఖిల్, జైనాబ్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సుమారు రెండేళ్లకు పైగా వీరి మధ్య ప్రేమాయణం సాగింది. గతేడాది నవంబర్ నెలలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. కొన్ని నెలల విరామం అనంతరం ఇప్పుడు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. 
Akhil Akkineni
Akhil Akkineni wedding
Zainab Ravjee
Mahesh Babu
Namrata Shirodkar
Akkineni family
Hyderabad reception
Telugu cinema
Annapurna Studios
Tollywood weddings

More Telugu News