Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదు

Kakani Govardhan Reddy Faces Another Case Filed
  • అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడ్డారని కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఫిర్యాదు
  • ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో గోవర్థన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు
  • అక్రమ మైనింగ్ కేసులో బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ
అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తులూరు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.

వైకాపా ప్రభుత్వ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటెయినర్ల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

అక్రమ మైనింగ్ కేసులో గోవర్ధన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఆయనపై మరో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. 
Kakani Govardhan Reddy
Nellore
Illegal Mining
Toll Gate
Andhra Pradesh
YSRCP
Krishnapatnam Port
Muthukur
High Court Bail

More Telugu News