Rinku Singh: రింకూ సింగ్‌-ప్రియా స‌రోజ్ డ్యాన్స్ చూశారా? ఇదిగో వీడియో!

Rinku Singh and Priya Saroj Engagement Video Goes Viral
  • క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం
  • లక్నోలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుక
  • హాజరైన మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్, పలువురు రాజకీయ ప్రముఖులు
  • ఈ ఏడాది నవంబర్ 18న రింకూ-ప్రియల వివాహం
  • సోషల్ మీడియాలో వెల్లువెత్తిన శుభాకాంక్షలు
  • నిశ్చితార్థం వేడుక‌లో హైలైట్‌గా నిలిచిన రింకూ-ప్రియా డ్యాన్స్
భారత క్రికెట్ జట్టు ఆటగాడు రింకూ సింగ్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన యువ ఎంపీ ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. లక్నో వేదికగా నిన్న‌ జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. 

లక్నోలోని 'ది సెంట్రమ్' హోటల్‌లో నిన్న‌ ఈ నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక సందర్భంలో, కాబోయే వధువు ప్రియా సరోజ్ అందమైన గులాబీ రంగు లెహంగాలో మెరిసిపోగా, రింకూ సింగ్ తెలుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. వేడుకలో ప్రియా సరోజ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేయగా, రింకూ సింగ్ ఆమెను ఆనందంగా చూస్తూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కొత్త జంట డ్యాన్స్ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

ఇక‌, ఈ కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఆయన సతీమణి, ఎంపీ డింపుల్ యాదవ్ హాజరయ్యారు. వీరితో పాటు సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత జయా బచ్చన్, ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా తదితర ప్రముఖులు విచ్చేసి కాబోయే దంపతులను అభినందించారు. ఈ ఏడాది నవంబర్ 18న వీరి వివాహం జరగనుంది.

రింకూ సింగ్ భావోద్వేగ పోస్ట్‌
నిశ్చితార్థం అనంతరం రింకూ సింగ్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. "ఈ నిరీక్షణలోని ప్రతి క్షణం విలువైనదే" అంటూ తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భావోద్వేగ‌పూరిత‌ పోస్ట్ చేశారు.

రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల‌ నేపథ్యం
రింకూ సింగ్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ టీమిండియా టీ20 టీమ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొంది, భారతదేశంలోని అత్యంత పిన్న వయస్కులైన పార్లమెంట్ సభ్యులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈ నిశ్చితార్థ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అభిమానులు, అనుచరుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Rinku Singh
Priya Saroj
Rinku Singh Priya Saroj engagement
Samajwadi Party
Akhilesh Yadav
Dimple Yadav
Indian cricketer
Member of Parliament
Lucknow
Indian Politics

More Telugu News