Mumbai Local Train Accident: ముంబై లోకల్ ట్రైన్‌లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

Mumbai Local Train Mishap Five Killed in Overcrowding Accident
  • కిక్కిరిసిన బోగీ నుంచి జారిపడిన 12 మంది ప్రయాణికులు
  • దివా-ముంబ్రా స్టేషన్ల మధ్య ప్రమాదం
  • గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స
  • ఘటనపై దర్యాప్తు  ప్రారంభించిన రైల్వే అధికారులు 
ముంబైలో ఈరోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్ లో నుంచి పలువురు ప్రయాణికులు కిందపడ్డారు. బోగీ కిక్కిరిసిపోవడంతో ఫుట్ బోర్డ్ పై వేలాడుతూ ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి థానే జిల్లాలోని కసార ప్రాంతానికి వెళ్తున్న లోకల్ ట్రైన్ నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. 12 మంది ప్రయాణికులు రైలు నుంచి కింద పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు స్పాట్ లోనే మరణించగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రయాణికుల రద్దీ, రైలు బోగీ కిక్కిరిసిపోయి ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. తీవ్రమైన రద్దీ వల్ల కొందరు ప్రయాణికులు డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణించారని, ఈ క్రమంలోనే వారు అదుపుతప్పి కిందపడిపోయారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ముంబై లోకల్ ట్రైన్లలో తరచూ కనిపించే రద్దీ సమస్య మరోసారి ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చింది.
Mumbai Local Train Accident
Mumbai train accident
Local train accident Mumbai
Chhatrapati Shivaji Maharaj Terminus
Thane district
Kasara
Indian Railways
Train overcrowding
Mumbai local train

More Telugu News