Pakistan: పాక్ నోట మళ్లీ అదే పాట.. మరో ఫేక్ ఫొటోతో ప్రచారం

Pakistan claims Adampur Air Force Station attack with fake photo
  • ఆదంపూర్ స్థావరంపై దాడి చేశామంటూ పలు ఫొటోలు బయటపెట్టిన పాక్
  • ఆధారాలతో తిప్పికొట్టిన సైబర్ నిపుణుడు
  • ఎస్-400 ధ్వంసమంటూ పాక్ ప్రచారం.. తన పర్యటనతో చెక్ పెట్టిన మోదీ 
భారత బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో తమ భూభాగంపై చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని పాకిస్థాన్ పాత పాటే పాడుతోంది. ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడి చేసి భారత వాయుసేనకు భారీ నష్టం కలిగించామని చెబుతోంది. గతంలో కూడా ఇదే తరహాలో పలు ఆరోపణలు చేసింది. ఆదంపూర్ లోని ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని పాక్ ఆరోపించింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో ప్రచారం చేసుకుంది. అయితే, ఆదంపూర్ లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్-400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ ముందు నిలబడి ప్రసంగించడం ద్వారా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు.

ఈ దుష్ప్రచారంతో పాకిస్థాన్ అంతర్జాతీయంగా నవ్వులపాలైంది. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని పాకిస్థాన్ తాజాగా మరో ఫేక్ ఫొటోతో ఆదంపూర్ వైమానిక స్థావరంలోని సుఖోయ్ యుద్ధ విమానాన్ని నాశనం చేశామని చెబుతోంది. అయితే, ప్రముఖ జియో-ఇంటెలిజెన్స్ నిపుణుడు డేమియన్ సైమన్ ఈ వాదనలను ఖండించారు. గత నెలలో జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణకు రెండు నెలల ముందు, అంటే మార్చి 2025లో తీసిన శాటిలైట్ చిత్రాన్ని సైమన్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఒక మిగ్-29 విమానం మరమ్మతులో ఉండటం, ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ వద్ద కనిపించే నల్లటి మసి సాధారణమైనదేనని ఆయన స్పష్టం చేశారు.
Pakistan
Adampur Air Force Station
Indian Air Force
Fake Photo
Operation Sindoor
S-400
Sukhoi
Damien Symon
Geo-Intelligence
propaganda

More Telugu News