Bhuma Akhila Priya: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అస్వస్థత

--
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈరోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు. డబ్ల్యూ. గోవిందిన్నెలోని మూల పెద్దమ్మ దేవరలో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.