Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

Padi Kaushik Reddy Faces Setback in High Court
--
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై నమోదైన కేసును కొట్టేసేందుకు తిరస్కరించింది. పోలీసులు నమోదు చేసిన కేసులో 188 సెక్షన్ ను కొట్టేసిన కోర్టు.. మిగతా సెక్షన్లలో విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఎమ్మెల్యేకు తేల్చిచెప్పింది. 

2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాడి కౌశిక్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నోడల్ అధికారి ఫిర్యాదు చేయగా కమాలపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే, ఈ కేసును కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. కేసును కొట్టివేయలేమని పేర్కొంటూ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ ను తోసిపుచ్చింది.
Padi Kaushik Reddy
BRS MLA
Telangana High Court
Assembly Elections 2023
Kamalapuram Police Station
Nampally Court
Case Dismissal
Election Campaign
Suicide Threat

More Telugu News