Honeymoon Murder Case: అర్ధరాత్రి ఏడుస్తూ వచ్చింది.. హనీమూన్ మర్డర్ కేసులో మరో సంచలనం

Sonam Raghuvanshi Honeymoon Murder Case New Twist
  • సోనమ్ రఘువంశీ మానసిక పరిస్థితిపై డాబా ఓనర్ కీలక వ్యాఖ్యలు
  • ఇంటికి ఫోన్ చేస్తానంటే తన ఫోన్ ఇచ్చినట్లు వెల్లడి
  • పోలీసుల రాకకు ముందు నిందితురాలు సోనమ్ కన్నీరు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘హనీమూన్ మర్డర్’ కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతులు హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ వెళ్లారు. ఈ ట్రిప్ లో భర్త రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. రాజాను ఆయన భార్య సోనమ్ రఘువంశీనే హత్య చేయించిందని ఆరోపిస్తూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నిందని, కిరాయి హంతకులను నియమించి హత్య చేయించిందని ఆరోపిస్తున్నారు. సోనమ్ ను పోలీసులు మేఘాలయలోని ఓ దాబా వద్ద అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే దాబా యజమాని కీలక విషయాలను వెల్లడించాడు.

నిన్న అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సోనమ్ రఘువంశీ తన దాబా వద్దకు వచ్చిందని సాహిల్ యాదవ్ చెప్పాడు. సోనమ్ ఒంటరిగా అర్ధరాత్రి పూట ఏడుస్తూ రావడంతో ఆందోళనకు గురయ్యానని తెలిపాడు. ఆ సమయంలో సోనమ్ తీవ్ర మనోవేదనతో కనిపించిందని చెప్పాడు. "రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఆమె ఏడుస్తూ దాబాకు వచ్చింది. ఇంటికి ఫోన్ చేయాలని అడిగింది. దీంతో నా ఫోన్ ఇచ్చాను, ఆమె కాల్ చేసుకుంది. ఆ తర్వాత ఆమెను కూర్చోమని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చాను. వారు వెంటనే వచ్చి ఆమెను తీసుకెళ్లారు" అని యాదవ్ వివరించాడు.
Honeymoon Murder Case
Sonam Raghuvanshi
Raja Raghuvanshi
Meghalaya Murder
Sahil Yadav
Crime News
Murder Conspiracy
ভাড়া killers
Police Investigation
Dhaba Owner

More Telugu News