Vikas Kumar: చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటన.. కీలక నిర్ణయం తీసుకున్న సస్పెండైన అధికారి!

Vikas Kumar Challenges Suspension After Chinnaswamy Stadium Stampede
  • చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో సీనియర్ ఐపీఎస్ వికాష్ కుమార్ సస్పెన్షన్
  • సస్పెన్షన్‌ను బెంగళూరు క్యాట్‌లో సవాలు చేసిన వికాష్ కుమార్
  • విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ వికాష్‌తో పాటు పలువురు పోలీసు అధికారుల సస్పెన్షన్
చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ సవాలు చేస్తూ సోమవారం బెంగళూరులోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.

ఈ ఘటన జరిగిన సమయంలో వికాస్ కుమార్ బెంగళూరు నగర పశ్చిమ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ మరియు అదనపు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తొక్కిసలాట జరిగిన చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లకు ఆయనే ఇన్‌చార్జిగా వ్యవహరించారు.

ఈ తొక్కిసలాట దుర్ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదుగురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. "జూన్ 4న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం" అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

"ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులను ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం, కింది స్థాయి అధికారులు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు స్పష్టమవుతోంది" అని ఉత్తర్వుల్లో తెలిపారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో వికాస్ కుమార్ కూడా ఉన్నారు.
Vikas Kumar
Chinnaswamy Stadium
Bangalore
stampede
Karnataka government
suspension
CAT
police officer
RCB victory celebration

More Telugu News