Roja: ప్రజల భద్రత కన్నా సెలూన్ షాప్ ఓపెనింగ్ ముఖ్యమా?: రోజా

Roja Slams Government Over Anantapur Crime Prioritizing Salon Opening Over Public Safety
  • అనంతపురం యువతి హత్యపై మాజీ మంత్రి రోజా స్పందన
  • ప్రభుత్వ పెద్దలపై తీవ్ర విమర్శలు 
  • రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వెల్లడి
కూటమి ప్రభుత్వ పెద్దలపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు. అనంతపురంలో ఓ యువతిని అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారని, మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనుక పడేశారని రోజా వెల్లడించారు. మంగళవారం నుంచి యువతి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని ఆమె ఆరోపించారు.

ఈ దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఏమాత్రం సరిగా లేదని రోజా విమర్శించారు. "ఆడబిడ్డ హత్యకు గురైతే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీకెండ్‌కు హైదరాబాద్ వెళ్లిపోయారు... ప్రజల భద్రత కంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సెలూన్ షాప్ ప్రారంభోత్సవాలు, ఇతర పర్యటనలు ముఖ్యమయ్యాయని ఎద్దేవా చేశారు.

హోం మంత్రి అనిత గారు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి, జగన్ గారి కుటుంబంపై ఆరోపణలు చేయడంపైనే దృష్టి సారించారని, రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని రోజా మండిపడ్డారు "ఇది రాష్ట్రంలో నేడు ఆడబిడ్డల పరిస్థితి! ఇది అధికారంలో ఉన్న వారిచే జరుగుతున్న నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం!" అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు.
Roja
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
YS Jagan
Anantapur
Crime
Women Safety
YSRCP
Political News

More Telugu News