Manchu Manoj: మూల పెద్దమ్మ జాతరలో సందడి చేసిన మంచు మనోజ్, మౌనిక

Manchu Manoj and Mounika at Moola Peddamma Jatara
  • మూల పెద్దమ్మ జాతరలో సందడి చేసిన మంచు మనోజ్, మౌనిక
  • మూల పెద్దమ్మ జాతరలో పాల్గొన్న నటుడు మనోజ్, మౌనిక దంపతులు
  • పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
నంద్యాల జిల్లాలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ సందడి చేశారు. ఆయన తన అర్ధాంగి భూమా మౌనికతో కలిసి డోర్నిపాడు మండలం, డబ్ల్యూ. గోవిందిన్నెలో జరుగుతున్న మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గోవిందిన్నెలో మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి మూల పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. నిన్న ఆమె సోదరి భూమా మౌనిక, మంచు మనోజ్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

మంచు మనోజ్ సినీ నటుడు కావడం, ఆయన అర్ధాంగి భూమా కుటుంబానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరి కావడంతో వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మనోజ్ దంపతులు వారిని ఆత్మీయంగా పలకరించి అభివాదం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. 
Manchu Manoj
Bhuma Mounika
Moola Peddamma Jatara
Nandyala District
Dornipadu
W Govindinne
Bhuma Akhila Priya
Telugu Cinema
Andhra Pradesh Festivals
Temple Festival

More Telugu News