WhatsApp: వాట్సాప్ నుంచి త్వరలో మరో కొత్త ఫీచర్

WhatsApp to Roll Out New Auto Download Quality Control Feature
  • ఇక ఫోటోలు, వీడియోల డౌన్ లోడ్ క్వాలిటీ ఎంపిక యూజర్ల చేతిలోకే..
  • డౌన్ లోడింగ్‌కు స్టాండర్డ్, హెచ్ డీ రెండు ఆప్షన్‌లు 
  • డ్యూయల్ అప్ లోడ్ ఫీచర్ ఆధారంగా కొత్త ఫీచర్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు బిలియన్ల యూజర్లు ఉన్నారు. యూజర్లను దృష్టిలో ఉంచుకుని మెటా యాజమాన్యంలోని ఈ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా యూజర్లకు మరో శుభవార్తను అందించింది.

వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోల ఆటో డౌన్‌లోడ్ క్వాలిటీ విషయంలో నియంత్రణను యూజర్లకే ఇవ్వనుంది. వాట్సాప్ ట్రాకర్ WABetainfo నివేదిక ప్రకారం ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.25.18.11 వాట్సాప్ బీటాలో యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్‌తో తమ ఫోన్‌లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయ్యే మీడియా ఫైల్స్ (ఫోటోలు, వీడియోలు) క్వాలిటీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అవసరం లేకపోతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేసుకునే సౌలభ్యం కూడా యూజర్లకు ఉంటుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఇలాంటి సదుపాయం లేదు.

ఈ ఆప్షన్ కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ అండ్ డేటాలో డౌన్‌లోడ్ క్వాలిటీని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాండర్డ్, హెచ్‌డీ ఆప్షన్‌లలో మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోవాలి. స్టాండర్డ్ క్వాలిటీని ఎంపిక చేసుకుంటే యూజర్లు ఎవరికైనా పంపే ఫోటోలు, వీడియోల క్వాలిటీ తగ్గుతుంది. తద్వారా డేటాతో పాటు మొబైల్ స్టోరేజ్ తక్కువగా ఉన్నా సరిపోతుంది. హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే డేటా వినియోగం పెరుగుతుంది. అదే సమయంలో మొబైల్‌లో ఎక్కువ స్టోరేజ్ ఆక్రమిస్తుంది.

ఈ సెట్టింగ్స్‌ను స్టాండర్డ్‌గా సెట్ చేసిన సమయంలో వాట్సాప్ మీడియా ఫైల్స్‌ను డిఫాల్ట్‌గా డౌన్‌లోడ్ చేస్తుంది. అయితే యూజర్లు అదే ఫైల్ హెచ్‌డీ వెర్షన్‌ను యాప్‌లో చూసి మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను వాట్సాప్ ఇటీవల డ్యూయల్ అప్‌లోడ్ ఫీచర్ ఆధారంగా తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్లే బీటా ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకున్న కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. మెటా ఏప్రిల్‌లో ఐఓఎస్ వెర్షన్ కోసం ఇలాంటి ఫీచర్‌నే ప్రారంభించింది, కానీ ఇప్పటి వరకు యూజర్లందరికీ అందుబాటులోకి రాలేదు. 
WhatsApp
WhatsApp new feature
WhatsApp update
WhatsApp beta
automatic download quality
photo video quality
storage settings
HD option
standard quality
WABetainfo

More Telugu News