Bala Bharosa scheme: ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి తెలంగాణ సర్కారు భరోసా

Telangana to launch Bala Bharosa scheme for children under 5
  • రాష్ట్రంలో బాల భరోసా పేరుతో సరికొత్త సంక్షేమ పథకం
  • అన్నిరకాల వైద్య పరీక్షలు చేయిస్తామన్న మంత్రి సీతక్క
  • అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా..
తెలంగాణలో చిన్నారుల సంక్షేమం కోసం మరోకొత్త సంక్షేమ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. ‘బాల భరోసా’ పేరుతో అమలు చేయనున్న ఈ పథకం కింద ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యంపై దృష్టిసారిస్తామన్నారు. చిన్నారులకు అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయిస్తామని, అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు.

ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో నిన్న కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సీతక్క ఈ వివరాలు వెల్లడించారు. బాల భరోసా పథకం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది చిన్నారులకు ఎంతో మేలు కలగనుంది. చిన్నారుల అనారోగ్యం, ప్రైవేట్ ఆసుపత్రుల బిల్లులతో అప్పులపాలవుతున్న తల్లిదండ్రులకు ఈ పథకం భారీ ఊరట కల్పించనుంది. కాగా, ఈ పథకంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Bala Bharosa scheme
Seethakka
Telangana government
child health
free medical tests
children welfare
Telangana
health scheme

More Telugu News