Nara Lokesh: బాలకృష్ణ బర్త్‌డే.. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్ అంటూ లోకేశ్ స్పెషల్ విషెస్

- బాలకృష్ణకు నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు
- సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపిన లోకేశ్
- ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య అంటూ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, అభిమానులందరూ ప్రేమగా పిలుచుకునే బాలయ్య బాబు నేడు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, తన మామగారైన బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా బాలయ్యకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్టు పెట్టారు.
"సిల్వర్ స్క్రీన్ పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్ స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.