Nandamuri Balakrishna: బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan Wishes Balakrishna a Happy Birthday
  • నేడు నందమూరి బాలకృష్ణ జన్మదినం
  • ప్రకటన విడుదల చేసిన పవన్ కల్యాణ్
  • బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని, ప్రజా సేవను కొనియాడిన వైనం
టాలీవుడ్ అగ్ర నటుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు (జూన్ 10) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పవన్ కల్యాణ్ తన సందేశంలో బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని, ప్రజా సేవను కొనియాడారు. "శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బాలకృష్ణ చారిత్రక, జానపద, పౌరాణిక వంటి విభిన్న పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని ఆయన ప్రశంసించారు.

ప్రజా జీవితంలో భాగంగా, హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి బాలకృష్ణ విశేషంగా కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. "దైవ భక్తి మెండుగా కలిగిన శ్రీ బాలకృష్ణ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలను అందించాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Nandamuri Balakrishna
Pawan Kalyan
Balakrishna birthday
Hindupuram MLA
AP Deputy CM
Telugu cinema
Tollywood
Birthday wishes
Public service

More Telugu News