WTC Final 2025: రేపటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్.. వేదిక, విజేతకు ప్రైజ్‌మనీ నుంచి పూర్తి వివరాలు ఇవిగో!

- లార్డ్స్‌లో రేపటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
- ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ పోరు
- తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న లార్డ్స్
- తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న దక్షిణాఫ్రికా
- భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం
- విజేతకు రూ. 30.83 కోట్ల ప్రైజ్‌మనీ
క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2025కు రంగం సిద్ధమైంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఈ మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా జట్లు ప్రతిష్ఠాత్మక టెస్టు గద కోసం తలపడనున్నాయి. వాతావరణం అనుకూలించని పక్షంలో జూన్ 16ను రిజర్వ్ డేగా ప్రకటించారు.
లార్డ్స్ మైదానం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. పాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు 2023లో ఓవల్‌లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.
మరోవైపు టెంబా బవుమా నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్. ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో ఫైనల్ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన లార్డ్స్‌లో వరుసగా రెండో టైటిల్ సాధించాలని ఆస్ట్రేలియా, చారిత్రక విజయం కోసం దక్షిణాఫ్రికా తలపడనుండటంతో ఈ ఫైనల్ అభిమానులకు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇక, ఈ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, భారత్‌లో ఎక్కడ చూడాలి, విజేతకు ప్రైజ్‌మనీ ఎంత, ఇరుజట్ల పూర్తి స్క్వాడ్స్ తదితర వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మ్యాచ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ఈ మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు) ప్రారంభమవుతుంది.
డబ్యూటీసీ ఫైనల్‌ను ఎక్కడ చూడాలి?
భారత్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే అభిమానులు డిస్నీ హాట్‌స్టార్ ద్వారా మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో కూడా వీక్షించవచ్చు.
ఆస్ట్రేలియా: అమెజాన్ ప్రైమ్ వీడియో
దక్షిణాఫ్రికా: సూపర్‌స్పోర్ట్ టీవీ
డబ్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీ?
విజేతకు: రూ. 30.83 కోట్లు
రన్నరప్‌కు: రూ. 18.49 కోట్లు
స్క్వాడ్‌లు:
దక్షిణాఫ్రికా: టోనీ డి జోర్జీ, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కార్బిన్ బాష్, కగిసో రబాడా, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, కేశవ్ మహారాజ్, సెనురాన్ ముత్తుసామీ.
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ, జోష్ ఇంగ్లిస్, కామెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, మాట్ కుహ్నెమాన్.