Kannappa Trailer: 'క‌న్న‌ప్ప' ట్రైల‌ర్ విడుద‌ల‌పై కీల‌క అప్‌డేట్‌

Kannappa Movie Trailer Release on June 13th
  • మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో క‌న్న‌ప్ప‌
  • ఈ నెల 13న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌ట‌న‌
  • ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్ రిలీజ్ 
  • జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా
మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ముకేశ్ కుమార్ సింగ్ తెర‌కెక్కిస్తోన్న క‌న్న‌ప్ప సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌పై మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెల 13న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. కాగా, ఈ సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. 

మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పరమశివుని గొప్ప భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను ఇప్ప‌టికే మేక‌ర్స్ ముమ్మ‌రం చేశారు.  'కన్నప్ప' చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా... మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పరమశివుడిగా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవి పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత రంకా, కౌశల్ మందా, బ్రహ్మానందం వంటి ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పటికే విడుదలైన 'కన్నప్ప' టీజర్, పాట‌లు, పోస్ట‌ర్లు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించాయి. ట్రైల‌ర్‌తో మ‌రింత జోష్ రావ‌డం ఖాయ‌మ‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. 
Kannappa Trailer
Manchu Vishnu
Kannappa movie
Mukesh Kumar Singh
Mohanlal
Prabhas
Akshay Kumar
Kajal Aggararwal
Telugu movie release

More Telugu News