Sonam: హనీమూన్ హత్య.. సుపారీ రూ.20 లక్షలకు పెంచిన భార్య

Sonam hired killers for husband Raja Raghuvanshis honeymoon murder
  • మేఘాలయ హనీమూన్‌లో భర్త దారుణ హత్య
  • భార్యే సూత్రధారి అని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
  • కిరాయి హంతకులకు రూ.20 లక్షలు ఆఫర్ చేసిన వధువు
  • నిందితుల్లో ఒకరితో భార్యకు సన్నిహిత సంబంధాలు
  • మృతదేహం లోయలో పడేయడంలోనూ భార్య సాయపడ్డట్లు ఆరోపణలు
మేఘాలయలో జరిగిన ఒక విషాదకర సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హనీమూన్‌కు వెళ్లిన దంపతుల్లో భర్త రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడు. ఈ హత్యను అతని భార్య సోనమ్ కిరాయి హంతకులతో కలిసి చేయించిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

రాజా రఘువంశీ, సోనమ్‌ల వివాహం మే 11న జరిగింది. పెళ్లయిన తొమ్మిది రోజులకే, మే 20న హనీమూన్ కోసం ఈ జంట మేఘాలయకు బయలుదేరింది. మే 23 నుంచి వారిద్దరి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి 11 రోజుల తర్వాత సోహ్రాలోని ఒక జలపాతం సమీపంలో లోతైన లోయలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అతని శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో, తలకు బలమైన గాయాలు కావడంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ హత్య వెనుక భార్య సోనమ్ హస్తం ఉన్నట్లు తేలింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, భర్త రాజా రఘువంశీని హత్య చేయడానికి సోనమ్ కిరాయి హంతకులతో భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. మొదట రూ.4 లక్షలు ఆఫర్ చేయగా, ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, హత్య అనంతరం రఘువంశీ మృతదేహాన్ని లోయలో పడేయడానికి కూడా సోనమ్ నిందితులకు సహకరించిందని ఆరోపణలు ఉన్నాయి.

ఆయుధమే పట్టించింది

"హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధం సాధారణంగా మేఘాలయలో వాడేది కాదు. దీంతో ఈ ఘటన వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని మాకు అనుమానం కలిగింది. ఆ తర్వాత కాల్ రికార్డులను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. సోనమ్, కుష్వాహా పథకం ప్రకారం హత్య చేసినప్పటికీ, వారు ఎంచుకున్న ఆయుధమే కేసు దర్యాప్తులో కీలక మలుపుకు దారితీసిందని తెలుస్తోంది.
Sonam
Raja Raghuvanshi
Meghalaya
honeymoon murder
contract killing
crime news

More Telugu News