Pawan Kalyan: కొణిదెల గ్రామానికి పవన్ కల్యాణ్ రూ.50లక్షల నిధుల అందజేత

Pawan Kalyan Donates Rs 50 Lakh for Konidela Village Development
  • నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల గ్రామాన్ని గతంలో దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్
  • ఇచ్చిన హామీ మేరకు రూ.50లక్షల నిధులు విడుదల చేసిన పవన్ కల్యాణ్
  • అధికారులకు చెక్కు అందజేసిన కలెక్టర్ రాజకుమారి
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలంలోని తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామ అభివృద్ధికి రూ.50 లక్షలు ప్రకటించిన విషయం విదితమే. ఈ మేరకు పవన్ కల్యాణ్ నిధులను మంజూరు చేశారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టరేట్‌లో నిన్న జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, డీఆర్ఓ రామునాయక్, పరిపాలనాధికారి రవికుమార్, సెక్షన్ సూపరింటెండెంట్ నరసింహరావులకు అందజేశారు. ఈ నిధులను కొణిదెల గ్రామాభివృద్ధికి వినియోగించాలని ఆమె సూచించారు.

ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కొణిదెల గ్రామ పరిస్థితి గురించి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఆ గ్రామ సర్పంచ్ వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు.

గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించగా, గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు గ్రామంలో 90 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మించడంతో పాటు రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర వసతులు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 
Pawan Kalyan
Konidela Village
Nandyala District
Andhra Pradesh
Village Development
Funding
Nandikotkur
Jay Surya
Infrastructure Development
Rural Development

More Telugu News