Raja Raghuwanshi: హనీమూన్‌లో భర్త హత్య.. కిరాయి హంతకులు ఫెయిలైతే తానే చంపేస్తానన్న భార్య!

Raja Raghuwanshi Wife Planned to Kill Husband on Honeymoon if Hitmen Failed
  • మేఘాలయ హనీమూన్‌లో భర్త రాజా రఘువంశీ దారుణ హత్య
  • భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా కుట్ర పన్నినట్టు ఆరోపణ
  • కిరాయి హంతకులు విఫలమైతే తానే చంపేస్తానని ప్రియుడితో చెప్పిన సోనమ్
హనీమూన్ హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులు చంపడంలో విఫలమైతే, తానే స్వయంగా ఆయనను కొండపై నుంచి లోయలోకి తోసివేయాలని ఆయన భార్య సోనమ్ రఘువంశీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

పోలీసుల కథనం ప్రకారం.. సోనమ్ ప్రియుడిగా అనుమానిస్తున్న రాజ్ కుష్వాహాతో.. "ఒకవేళ విశాల్, ఆనంద్, ఆకాశ్ కలిసి రాజాను చంపలేకపోతే ఫోటో తీస్తున్నట్టు నటిస్తూ నేనే అతడిని కొండపై నుంచి తోసేస్తాను" అని చెప్పినట్టు తెలిసింది.  

వివాహం జరిగిన నాలుగు రోజులకే మే 15న ఇండోర్‌లోని పుట్టింటికి తిరిగి వచ్చిన సోనమ్, అక్కడి నుంచే ఈ హత్యకు పథకం రచించినట్టు సమాచారం. గువాహటికి టికెట్లు బుక్ చేసుకోవడమే కాకుండా, రాజ్ కుష్వాహాతో ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరుపుతూ కుట్రను అమలుపరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంది. భర్త రాజా రఘువంశీతో శారీరక సంబంధాన్ని వాయిదా వేసేందుకు, మేఘాలయ వెళ్లే ముందు కామాఖ్య ఆలయాన్ని సందర్శించాలని, అది ఒక మంచి శకునమని నమ్మించి, సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రాజా రఘువంశీ పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ఆయన తలపై పదునైన ఆయుధంతో రెండుసార్లు దాడి చేశారు. "మృతుడి తలపై రెండు చోట్ల పదునైన ఆయుధంతో దాడి చేసిన గాయాలున్నాయి. ఒకటి తల వెనుక భాగంలో, మరొకటి ముందు భాగంలో ఉంది" అని తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సియెమ్ వెల్లడించారు.  
Raja Raghuwanshi
Sonam Raghuwanshi
honeymoon murder case
Meghalaya murder
Raj Kushwaha
contract killers
Guwahati
Kamakhya Temple
East Khasi Hills
crime news

More Telugu News