Banerjee: అదృష్టం లేకపోతే అంతే: నటుడు బెనర్జీ

- నటుడిగా సుదీర్ఘ ప్రయాణం
- కెరియర్ పట్ల సంతృప్తి ఉందన్న బెనర్జీ
- మెగాస్టార్ కష్టం తెలుసని వెల్లడి
- సౌందర్య గొప్ప ఆర్టిస్ట్ అంటూ వివరణ
నటుడు బెనర్జీ గురించి తెలియని వాళ్లంటూ ఉండరు. సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగిస్తున్న వారాయన. అలాంటి బెనర్జీ తాజాగా సుమన్ టీవీతో మాట్లాడారు. "ఇండస్ట్రీలో రాణించడం అంత తేలికైన విషయమేం కాదు. ఎంతగా కష్టపడినా ఎంతోకొంత అదృష్టం ఉండాలి. లేకపోతే ఏమీ చేయలేము. కష్టానికి తగిన ప్రతిఫలం పొందాలంటే కాలం కలిసి రావాలి అంతే" అని అన్నారు.
" కొంతమంది ఎంతగా కష్టపడినా డబ్బు - పేరు రెండూ రావు. కొంతమందికి పేరు వచ్చినా డబ్బురాదు. పేరుతో పాటు డబ్బు సంపాదించుకున్నవారు, ఆ తరువాత డబ్బును పోగొటున్నవారూ చాలామంది ఉన్నారు. అందువలన ఇవన్నీ సరిగ్గా నిలవాలంటే అదృష్టం ఉండాలని నమ్ముతాను. నా కెరియర్ విషయానికి వస్తే, నేను హ్యాపీగానే ఉన్నానని చెబుతాను" అని అన్నారు.
" నాకు చిరంజీవిగారు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఆయన గ్రాఫ్ ను నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన చాలా కష్టాలు పడుతూ మెగాస్టార్ అయ్యారు. అప్పటికీ .. ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. అలాగే సౌందర్య కూడా ఎంతటి స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికీ చాలా సింపుల్ గా ఉండేవారు. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా ఉంటుందో .. అలాగే ఉండేవారు. సావిత్రి .. వాణిశ్రీ .. జయసుధ తరువాత సౌందర్యనే అనిపించుకోవడానికి కారణం ఆమె కృషినే" అని చెప్పారు.