Pawan Kalyan: 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' నుంచి క్రేజీ అప్‌డేట్.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే!

Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Shooting Updates
  • 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' సినిమా షూటింగ్‌లో చేరిన పవన్ 
  • హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం
  • పవన్ స్టైలిష్ లుక్ వీడియోను విడుదల చేసిన మైత్రి మూవీ మేకర్స్
  • చిత్రీకరణలో పాల్గొంటున్న హీరోయిన్‌ శ్రీలీల 
  • 30 రోజుల పాటు నిర్విరామంగా తొలి షెడ్యూల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకదాని తర్వాత ఒకటిగా తన సినిమాల చిత్రీకరణను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇటీవలే 'హరిహర వీరమల్లు' వంటి భారీ పీరియాడిక్ డ్రామాతో పాటు, సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' అనే గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్‌ను కూడా పవన్ పూర్తి చేశారు. ఈ రెండు చిత్రాలు వేటికవే భిన్నమైన జానర్లలో రూపొందడంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేసిన ఓ వీడియోతో ఈ సినిమా సందడి మొదలైంది. ఈ వీడియోలో పవన్ చాలా స్టైలిష్‌గా సెట్‌లో అడుగుపెట్టడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చిత్రీకరణ జూన్ 10న ప్రారంభం కాగా, పవన్ ఈరోజు షూటింగ్‌లో జాయిన్ అయినట్లు సమాచారం. విడుదలైన వీడియోలో కథానాయిక శ్రీలీల కూడా కనిపించడం విశేషం.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

తాజాగా ప్రారంభ‌మైన‌ ఈ సినిమా తొలి షెడ్యూల్ సుమారు 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరగనుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ చిత్రంలో నటిస్తున్న శ్రీలీలకు ఈ సినిమా విజయం చాలా కీలకంగా మారింది. ఇటీవలే 'రాబిన్‌హుడ్' సినిమాతో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్'పై ఆమె భారీ ఆశలే పెట్టుకున్నారు. నిజానికి శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలోనే ఈ సినిమాకు సంతకం చేశారు. అయితే, వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. 

ఈ మధ్యలో కొన్ని సినిమాలతో మంచి స్టార్‌డమ్ సంపాదించినప్పటికీ, ఇటీవల వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ను కొంత డైలమాలో పడేశాయి. ఈ తరుణంలో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' విజయం సాధిస్తే, శ్రీలీల మార్కెట్ మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
Sreeleela
Mythri Movie Makers
Devi Sri Prasad
Tollywood
Telugu cinema
movie shooting
Gabbar Singh

More Telugu News