Rajinikanth: 'కూలీ'పై అంచనాలు మామూలుగా లేవే!

Coolie Movie Update
  • 'కూలీ'గా వస్తున్న రజనీకాంత్
  • లోకేశ్ కనగరాజ్ నుంచి మరో యాక్షన్ మూవీ ఇది 
  • ఆగస్టు 14న భారీస్థాయి రిలీజ్ 
  • వివిధ భాషల నుంచి కనిపించనున్న సీనియర్ స్టార్స్  

రజనీకాంత్ .. ఒక పేరు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ప్రభావితం చేసే మహా మంత్రం. ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే, అభిమానుల అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఓపెనింగ్స్ మొదలు ప్రతి విషయంలోను ఆ సినిమా సృష్టించనున్న రికార్డులను గురించిన చర్చలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి చర్చల్లో నలుగుతున్న సినిమానే 'కూలీ'. 

'విక్రమ్' సినిమాతో కమల్ హాసన్ కి కెరియర్ లోనే పెద్ద హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్, 'కూలీ' సినిమాకి దర్శకుడు. లోకేశ్ కి యాక్షన్ సినిమాలపై ఎంత పట్టు ఉందనేది ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలు నిరూపించాయి.  ఇప్పుడు ఆ యాక్షన్ కి రజనీ స్టైల్ తోడైతే ఎలా ఉంటుందనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందువలన ఆగస్టు 14 కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ఆ రోజునే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం భారీ మొత్తం చెల్లించడానికి అన్నపూర్ణ - సితార సంస్థలు సిద్ధంగా ఉన్నాయనే ఒక టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగులో 'జైలర్' చేసిన సందడిని ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఆ ప్రభావమే 'కూలీ' రేటు పెంచుతోందని అంటున్నారు. 'జైలర్'లో మాదిరిగానే, ఈ సినిమా కోసం కూడా తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ  భాషల నుంచి స్టార్స్ ను తీసుకోవడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా తెలుగు రైట్స్ ఎవరికి దక్కుతాయనేది. 
Rajinikanth
Coolie movie
Lokesh Kanagaraj
Jailer movie
Annapurna Studios
Sithara Entertainments
Telugu movie rights
Kollywood
Tamil cinema
Indian cinema

More Telugu News