Kishan Reddy: కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి విమర్శలు.. స్పందించిన రాజాసింగ్

Revanth Reddy criticizes Kishan Reddy Raja Singh responds
  • తెలంగాణ ప్రాజెక్టులకు కిషన్ రెడ్డి అడ్డంకి అన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఢిల్లీలో విమర్శలు ఎందుకు? ఇక్కడే అడగొచ్చుగా అని రాజాసింగ్ ప్రశ్న
  • కిషన్ రెడ్డి అంశంపై మోడీకి ఫిర్యాదు చేయొచ్చు కదా అన్న రాజాసింగ్
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, "రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఢిల్లీ వెళ్లిన తర్వాత కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి మండిపడతారు" అని అన్నారు. కొన్ని రోజుల క్రితం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకే సభా కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేస్తూ, "అప్పుడు కిషన్ రెడ్డిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఎందుకు అడగలేదు?" అని నిలదీశారు. ఒకవేళ కిషన్ రెడ్డి నిజంగానే రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే, ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేయవచ్చు కదా అని కూడా ఆయన సూచించారు.
Kishan Reddy
Revanth Reddy
Raja Singh
Telangana Politics
BJP
Congress
Central Projects

More Telugu News