Dil Raju: పవన్ కల్యాణ్ సూచనలు చేశారంటూ... తన సినిమా టిక్కెట్ ధరలపై దిల్ రాజు కీలక ప్రకటన

Dil Raju Announces Key Decision on Movie Ticket Prices After Pawan Kalyan Suggestions
  • సినీ పరిశ్రమలో మార్పు రావాలన్న నిర్మాత దిల్ రాజు
  • ఇకపై తన చిత్రాలకు టికెట్ ధరలు పెంచబోనని స్పష్టం
  • ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పవన్ కొన్ని సూచనలు చేశారని వెల్లడి
  • పవన్ కల్యాణ్ సూచనలను తప్పక పాటిస్తానని హామీ
  • నిర్మాతలందరూ పవన్ సూచనలు పాటించాలని విజ్ఞప్తి
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక కీలక మార్పు అవసరమని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ మార్పునకు శ్రీకారం చుడుతూ, తాను నిర్మించే సినిమాలకు ఇకపై టికెట్ ధరలు పెంచేది లేదని ఆయన బుధవారం స్పష్టం చేశారు. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన కొన్ని సూచనలు తన నిర్ణయానికి ప్రేరణ అని దిల్ రాజు తెలిపారు.

సినిమా టికెట్ల ధరల విషయంలో కొంతకాలంగా ప్రేక్షకుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిల్ రాజు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మాట్లాడుతూ, "ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ తీసుకురావడానికి పవన్ కల్యాణ్ కొన్ని విలువైన సూచనలు చేశారు. వాటిని నేను తప్పకుండా పాటిస్తాను" అని చెప్పారు. సినీ పరిశ్రమ బాగు కోసం పవన్ కల్యాణ్ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, తోటి నిర్మాతలు కూడా పవన్ కల్యాణ్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని, వాటిని ఆచరణలో పెట్టాలని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటేనే పరిశ్రమకు మేలు జరుగుతుందని, ప్రేక్షకులు కూడా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపుతారని ఆయన అన్నారు. సినీ రంగంలో ప్రస్తుతం ఒక సానుకూల మార్పు అవసరమని, దానికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని దిల్ రాజు భరోసా ఇచ్చారు.

'తమ్ముడు' సినిమాకి సంబంధించిన పారితోషికం గురించి నితిన్ పెద్దగా ఆలోచించలేదని గుర్తు చేసుకున్నారు. మీరు ఇవ్వాలనుకున్నంత ఇవ్వండని అన్నాడని, అందుకు కృతజ్ఞతలు చెప్పారు. చాలామంది స్టార్ హీరోలలో కొంతమంది తనను భుజం తట్టి తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు.
Dil Raju
Pawan Kalyan
Telugu cinema
movie ticket prices
Tollywood
cinema industry

More Telugu News