Krishnam Raju: అమరావతి మహిళలపై వ్యాఖ్యలు: సాక్షి టీవీపై ఎన్‌హెచ్ఆర్సీ కేసు నమోదు

Krishnam Raju Arrested for Comments on Amaravati Women Sakshi TV Faces NHRC Case
  • సాక్షి టీవీ చర్చలో అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు
  • జర్నలిస్ట్ కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలు
  • సాక్షి టీవీపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు
  • ఫిర్యాదు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్, సాక్షి టీవీపై కేసు నమోదు
సాక్షి టెలివిజన్‌లో ప్రసారమైన ఒక చర్చా కార్యక్రమంలో అమరావతి మహిళలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) స్పందించింది. ఈ వివాదాస్పద వ్యవహారంపై నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అందించిన ఫిర్యాదు ఆధారంగా, ఎన్‌హెచ్ఆర్సీ సాక్షి టీవీపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

అమరావతి మహిళలను 'వేశ్యలు'గా, అమరావతిని 'వేశ్యల రాజధాని'గా అభివర్ణిస్తూ సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయడం ద్వారా రాజధానిని, అక్కడి మహిళలను తీవ్రంగా అవమానించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణించి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను అభ్యర్థించారు. ఎంపీ చేసిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం, కమిషన్ సాక్షి టీవీపై కేసు నమోదు చేసిందని సమాచారం.
Krishnam Raju
Amaravati women
Sakshi TV
Andhra Pradesh
NHRC
Lavu Sri Krishna Devarayalu

More Telugu News