SBI Clerk: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల

SBI Junior Associate Mains Results Declared
  • ఎస్బీఐలో 13,735 క్లర్క్ పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణ
  • ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్ధుల జాబితా విడుదల
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ, క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ 10, 12 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను నిన్న అధికారులు విడుదల చేశారు.

మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను ఎస్బీఐ ప్రకటించింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ పరీక్ష రాయాల్సి ఉంటుంది.

మొత్తం 13,735 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 17 నుంచి ఈ ఏడాది జనవరి 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, మార్చి నెలాఖరులో ఫలితాలను ప్రకటించారు. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి ఏప్రిల్ 10, 12 తేదీల్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను వెల్లడించారు. 
SBI Clerk
SBI Clerk Mains Result
SBI Junior Associate
SBI Recruitment 2024
Government Bank Jobs
Bank Exams
Clerk Jobs
Language Proficiency Test
SBI PO Exam

More Telugu News