Kalpika Ganesh: నటి కల్పిక గణేశ్‌పై కేసు న‌మోదు

Kalpika Ganesh Faces Police Case After Pub Incident
  • గచ్చిబౌలి ప్రిజం పబ్‌లో కేక్ విషయంలో సిబ్బందితో వాగ్వాదం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పబ్ యాజమాన్యం
  • న‌టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సినీ నటి కల్పికా గణేష్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ప్రిజం పబ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేక్ విషయంలో మొదలైన చిన్నపాటి వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి, చివరికి పోలీసు కేసు వరకు దారితీసింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళితే... నటి కల్పిక గత నెల 29న ప్రిజం పబ్‌కు వెళ్లారు. రూ. 2200 బిల్ చేసి, కాంప్లిమెంట‌రీగా కేక్ ఇవ్వ‌మ‌ని కోరార‌ట‌. అలా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని మేనేజ‌ర్ చెప్పారు. ఈ విషయంలో కల్పిక గణేశ్‌కు, పబ్‌ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఆ సమయంలో నటి కల్పిక తమ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పబ్‌ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లేట్స్‌ విసిరేయడం, సిబ్బందిని బాడీ షేమింగ్‌ చేయడం, బూతులు తిట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పబ్‌లో గొడవకు సంబంధించి కల్పిక ఇటీవలో ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేక్‌ విషయంలో తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించడమే కాకుండా డ్రగ్‌ ఎడిక్ట్‌ అంటూ దూషించారని అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో సిబ్బందితో వాగ్వాదం జరిగిందని, అది ముదరడంతో పబ్‌ నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించారని తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 

'ప్రయాణం', 'సారొచ్చారు', 'మా వింత గాధ వినుమా', 'యశోద' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కల్పిక గణేశ్‌కు జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
Kalpika Ganesh
Kalpika Ganesh case
Prism Pub
Hyderabad
Gachibowli
Body shaming
Tollywood actress
Controversy
Birthday party
Police complaint

More Telugu News