Pawan Kalyan: ప‌వ‌న్ ప్ర‌మాణానికి ఏడాది.. ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసిన జ‌న‌సేన‌!

Pawan Kalyan Janasena Releases Video Marking One Year as Deputy CM
  • డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తి
  • ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ స్ఫూర్తిదాయక వీడియో విడుదల
  • "గేమ్ ఛేంజర్"‌గా పవన్ ప్రస్థానాన్ని వివరించిన వీడియో
  • పిఠాపురంలో చారిత్రక విజయం, పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ ఓ ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. కొణిదెల ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే నేను అని ప‌వ‌న్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేసి నేటికి ఏడాద‌వుతోంది. ఈ ఏడాది కాలంలో పార్టీ సాధించిన ప్రగతి, పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలను ఈ వీడియోలో పొందుపరిచారు.

ప్ర‌తి ఇంటికి మంచినీరు అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం, 55 గిరిజ‌న గ్రామాల‌కు 39 కిలోమీట‌ర్లు రోడ్లు వేయ‌డం, కుంకీ ఏనుగుల‌ను తీసుకురావ‌డం, ప్రైవేటు ఎల‌క్ట్రీషియ‌న్ల‌కు సేఫ్టీ కిట్స్ అందించ‌డం వంటివి వీడియోలో చూపించారు. పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ ప్రత్యేక వీడియో, పవన్ ఒక సాధారణ రాజకీయ నేత స్థాయి నుంచి "గేమ్ ఛేంజర్"‌గా ఎలా ఎదిగారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 

పిఠాపురంలో ఆయన సాధించిన తొలి ఎన్నికల విజయం ఆ ప్రాంతంలో పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్ అందించిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఆయన తిరగరాసిన విధానం వంటి అంశాలను వీడియోలో ప్రముఖంగా ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ సహనం, పట్టుదల, వ్యూహాత్మక పొత్తుల ద్వారా జనసేనను రాష్ట్ర రాజకీయాల్లో అగ్రస్థానానికి చేర్చినట్లు వివరించారు.

పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో వీడియోలోని వ్యాఖ్యాతలు విశ్లేషించారు. సంకీర్ణ రాజకీయాల్లో తలెత్తే అంతర్గత విభేదాలను చాకచక్యంగా పరిష్కరిస్తూ, ఆయన ప్రదర్శించిన రాజకీయ పరిణతి ప్రధాని నరేంద్ర మోదీ వంటి జాతీయ నాయకుల ప్రశంసలు సైతం అందుకున్న విష‌యం తెలిసిందే.

ఈ వీడియో ద్వారా పార్టీ శ్రేణులకు స్ఫూర్తినిస్తూనే, రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రజలకు గుర్తు చేయడమే లక్ష్యమని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. 
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Deputy CM
Pithapuram
AP Politics
Narendra Modi
Political Alliance
Election Victory
Political Journey

More Telugu News