Atluri Poornachandra Rao: అప్పుడు గేటు కీపర్ ని .. ఆ తరువాత 87 సినిమాల నిర్మాతని!

Atluri Poornachandra Rao Interview
  • 1952లో కెరియర్ మొదలైంది
  • థియేటర్ గేట్ కీపర్ గా పనిచేశాను  
  • మద్రాస్ లో ఎన్నో అవమానాలు భరించాను
  • 87 సినిమాలను నిర్మించాను 
  • నేనంటే అమితాబ్ కీ .. రజనీకి ఎంతో అభిమానమన్న నిర్మాత
  
అట్లూరి పూర్ణచంద్రరావు 1936లో జన్మించారు. 1952లో తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన వయసు 90 ఏళ్లు. 87 సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్'లో ఆయన పేరును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన సుమన్ టీవీ వారితో మాట్లాడారు. నాగిరెడ్డి - చక్రపాణి అవార్డు కోసం తనని ఎంపిక చేయడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు. 

" పెద్దగా చదువుకోలేదు .. ఆర్ధికంగా బలంగా లేని కుటుంబం. బ్రతకడానికి మరో దారి లేకపోవడం వలన సినిమాల వైపుకు వచ్చాను. విజయవాడ 'మారుతీ టాకీస్' గేట్ కీపర్ గా పనిచేశాను. ఆ తరువాత తాతినేని ప్రకాశరావుగారి ద్వారా మద్రాస్ చేరుకున్నాను. కొంతమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాను .. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. సినిమాలకి సంబంధించి చిన్న చిన్న పనులు చేస్తూనే, ప్రొడక్షన్ వైపుకు వెళ్లాను" అని అన్నారు.

ఆ తరువాత కొంతకాలానికి నిర్మాతగా మారాను. కెరియర్ మొత్తంలో 87 సినిమాలు నిర్మించాను. వాటిలో 50 సక్సెస్ అయితే, మిగతా 37 సినిమాలు చాలా ఇబ్బంది పెట్టాయి. తెలుగులో 'యమగోల' .. 'చట్టానికి కళ్లులేవు' సినిమాలు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. నా కెరియర్ మొత్తంలో నేను ఎక్కువగా చనువుగా ఉండే హీరోలు అమితాబ్ .. రజనీకాంత్. నేను ఫోన్ చేస్తే నా కోసం వాళ్లు షూటింగులు మానేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి" అంటూ తన అనుభవాలను పంచుకున్నారు. 

Atluri Poornachandra Rao
Telugu cinema
Producer
Gaddar Film Awards
Nagireddy Chakrapani Award
Yama Gola
Chattaniki Kallu Levu
Tollywood
Film producer
Telugu film industry

More Telugu News